Animal: 'నాన్న నువ్వు నా ప్రాణం'.. యానిమల్ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్..

  • IndiaGlitz, [Tuesday,November 14 2023]

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'యానిమల్'. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి 'నాన్న నువ్వు నా ప్రాణం' అంటూ సాగే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తండ్రీకొడుకులైన అనిల్ కపూర్‌-రణ్‌బీర్‌ కపూర్‌ మధ్య వచ్చే సన్నివేశాలతో ఎమోషనల్‌ టచ్‌తో ఈ పాట సాగుతుంది. సినిమా థీమ్‌ను ప్రతిబింబించేలా ఈ పాట ఉందని అర్థమవుతోంది. అనంత్ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను సోను నిగమ్‌ పాడాడు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి యానిమల్‌ నుంచి ఇటీవలే ‘అమ్మాయీ..’, ‘నే వేరే..’ అంటూ సాగే రెండు పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక తండ్రీకొడుకుల ప్రయాణం నేపథ్యంలో సాగే కథతో యానిమల్ ఉండబోతున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే లాంఛ్ చేసిన యానిమల్‌ పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్‌, టీ సిరీస్‌ సంస్థలపై భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ముందుగా ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలని భావించినా.. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్, శక్తి కపూర్, పృథ్వీ, తదితరులు నటిస్తున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

More News

Nadendla Manohar: జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్‌ జరిగింది: నాదెండ్ల

జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్‌ జరిగిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

YS Jagan: సీఎం జగన్ చొరవతో నెరవేరనున్న దశాబ్దాల కల

కొందరు నాయకులు ప్రజలకు మంచి జరిగే పనులు మొదలుపెట్టారంటే.. పూర్తిచేసే దాకా విశ్రమించరు. అలాంటి పట్టువదలని నాయకుడిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.

AP CID: టీడీపీ బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని సీఐడీ నోటీసులు

ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని తెలియజేస్తూ సీఐడీ కానిస్టేబుల్ ఒకరు కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు నోటీసులు ఇచ్చారు.

బీజేపీలోకి మాజీ ఎంఐఎం నేత.. ఆహ్వానించిన కిషన్ రెడ్డి..?

తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గెలుపు కోసం అవసరమైన ప్రతి చిన్న అవకాశాన్ని పార్టీలు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

సంపన్న అభ్యర్థిగా వివేక్.. నిరుపేద అభ్యర్థిగా బండి సంజయ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో కీలక నేతల ఆస్తుల వివరాలపై అందరు చర్చించుకుంటున్నారు.