ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు: ‘వి’ ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని 25వ చిత్రంగా తెరకెక్కిన ‘వి’ ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై విడుదల కానున్న విషయం తెలిసిందే. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు, నివేదా థామస్, ఆదితిరావు హైదరి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నాని తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ నాని, సుధీర్బాల మధ్య జరిగే ఆసక్తికర దృశ్యాలను చూపించారు. సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. సైకిక్ కిల్లర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌కు మధ్య ఛాలెంజింగ్ గేమ్‌గా ఈ సినిమా కనిపిస్తోంది.
‘ఏ పని చేసినా ఎంటర్టైనిగ్గా చేయాలనేది నా పాలసీ..’ అని చెబుతున్న నాని వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు... అంటూ నాని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నానిని పట్టుకోవడం కోసం సుధీర్‌బాబు చేసే ప్రయత్నాలు.. సైకిక్ కిల్లర్‌గా నాని చూపించిన పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. తొలిసారి విలన్‌గా నాని తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీస్‌కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే ప్రాణం. అమిత్ త్రివేది అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ కానుంది. అలాగే ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు. పీజీ విందా సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments