మాన‌సిక స‌మ‌స్య‌తో నాని..?

  • IndiaGlitz, [Tuesday,August 11 2020]

అదేంటి? నేచుర‌ల్ స్టార్ నానికి మాన‌సిక స‌మ‌స్యా? అని అనుకోకండి. ఎందుకంటే..ఇది ఆయ‌న త‌న సినిమాలో చేస్తున్న ఓ పాత్ర ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను ఎలివేట్ చేస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ పాటికి ట‌క్ జ‌గ‌దీష్ మూవీ పూర్తై ఉండేది. దీని త‌ర్వాత శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం లైన్‌లో ఉంది. మ‌రికొన్ని సినిమాల‌కు క‌థ‌ల‌ను ఓకే చేసున్నారు నాని.

కాగా.. సోషల్ మీడియా స‌మాచారం మేర‌కు నాని ప్ర‌స్తుతం చేస్తున్న ట‌క్ జ‌గదీష్‌లో డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌, నానిని కొత్త కోణంలో ఎలివేట్ చేస్తున్నారట‌. వివ‌రాల ప్ర‌కారం ఈ చిత్రంలో నాని ఓ బై పోలార్ డిజార్డ‌ర్ స‌మ‌స్య ఉన్న వ్య‌క్తిగా క‌నిపిస్తారట‌. బై పోలార్ డిజార్డ‌ర్ అంటే.. ఎమోష‌న్స్ అది బాధ అయినా, సంతోష‌మైనా ఎక్కువ‌గా చూపించే త‌త్వం అన్న‌మాట‌. మ‌రి ఇలాంటి పాత్ర‌లో నానిని డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ఎలా ఎలివేట్ చేస్తారు? అనేది చూడాలి.

More News

ఎన్‌.శంక‌ర్ భూముల వ్య‌వ‌హారంలో వివ‌ర‌ణ అడిగిన హైకోర్టు

గత ఏడాది టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స్టూడియో నిర్మాణానికి త‌క్కువ ధ‌ర‌కు భూములు ఇచ్చారు.

ర‌వితేజ నెక్ట్స్ మూవీ రీమేకా..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏక‌ధాటిగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ‘క్రాక్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు ర‌వితేజ‌.

ఏడాది వెన‌క్కి వెళ్లిన ఆమిర్ ఖాన్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా రిలీజ్‌లు వాయిదా ప‌డుతున్నాయి. ఇప్పుడు ఈ కోవ‌లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చ‌ద్దా’ కూడా చేరింది.

వారి నటన నన్నెంతగానో ఆకట్టుకుంది: రామ్‌చ‌ర‌ణ్‌

సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇటు సినీ, అటు రాజకీయ ప్రముఖులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు.