నాని.. వరుసగా మూడో సంవత్సరం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో నాని ఒకరు. 2015లో విడుదలైన భలే భలే మగాడివోయ్ నుంచి ఈ జూలై నెలలో వచ్చిన నిన్ను కోరి వరకు వరుసగా ఆరు విజయాలు సొంతం చేసుకున్నాడాయన. ప్రస్తుతం నాని రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలే.. ఎం.సి.ఎ, కృష్ణార్జున యుద్ధం. ఈ రెండు సినిమాలు కూడా రెండు నెలల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో ఎం.సి.ఎ డిసెంబర్‌లో రానుంటే.. కృష్ణార్జున యుద్ధం ఫిబ్రవరిలో రానుంది.
విశేషమేమిటంటే.. ఫిబ్రవరి నెలలో నాని నుంచి వస్తున్న సినిమాలు ఇటీవల కాలంలో మంచి విజయం సాధించాయి. 2016లో కృష్ణగాడి వీర ప్రేమగాథ.. 2017లో నేను లోకల్ చిత్రాలు కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వరుసగా మూడో సంవత్సరం కూడా నాని సక్సెస్‌ని అందుకుంటాడేమో చూడాలి. కృష్ణార్జున యుద్ధంలో నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com