మూడోసారి అదే మ్యూజిక్ డైరెక్టర్‌తో నాని
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని వరు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. తన 25వ సినిమా `వి` ఉగాది సందర్భంగా విడుదల కావాల్సింది. కానీ కరోనా ప్రభావంతో విడుదల కాలేదు. వి సినిమా షూటిగ్ పూర్తయ్యిందో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన 26వ సినిమాకు రెడీ అయిపోయాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండా తన 27వ సినిమాను రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగ రాయ్`ని అనౌన్స్ చేశాడు. `టాక్సీవాలా` తర్వాత రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే శ్యామ్ సింగరాయ్ సెట్స్‌పై ఉండేది. కానీ అలా జరగలేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుల చేయాలని అనుకున్నారు.
ప్రారంభంలో ఈ సినిమాకు సంగీతం అందించడానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్‌తో చిత్ర యూనిట్ సంప్రదింపులు చర్చలు జరుపుతున్నారని టాక్ వచ్చింది. అయితే తాజా సమాచారం మేరకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తాడని అంటున్నారు. నాని హీరోగా చేసిన జెర్సీ, గ్యాంగ్‌లీడర్ చిత్రాలకు అనిరుద్ సంగీతం అందించాడు. ఇప్పుడు మూడోసారి ఈ కాంబోలో సినిమా రానుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments