మూడోసారి అదే మ్యూజిక్ డైరెక్టర్‌తో నాని

  • IndiaGlitz, [Wednesday,April 15 2020]

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. త‌న 25వ సినిమా 'వి' ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో విడుద‌ల కాలేదు. వి సినిమా షూటిగ్ పూర్త‌య్యిందో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో 'ట‌క్ జ‌గ‌దీష్‌' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండా త‌న 27వ సినిమాను రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో 'శ్యామ్ సింగ రాయ్‌'ని అనౌన్స్ చేశాడు. 'టాక్సీవాలా' త‌ర్వాత రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న చిత్ర‌మిది. ఈ సినిమాను డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అంతా స‌వ్యంగా జ‌రిగి ఉంటే శ్యామ్ సింగ‌రాయ్ సెట్స్‌పై ఉండేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుల చేయాల‌ని అనుకున్నారు.

ప్రారంభంలో ఈ సినిమాకు సంగీతం అందించ‌డానికి ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్‌తో చిత్ర యూనిట్ సంప్ర‌దింపులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని టాక్ వ‌చ్చింది. అయితే తాజా స‌మాచారం మేర‌కు అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తాడ‌ని అంటున్నారు. నాని హీరోగా చేసిన జెర్సీ, గ్యాంగ్‌లీడ‌ర్ చిత్రాల‌కు అనిరుద్ సంగీతం అందించాడు. ఇప్పుడు మూడోసారి ఈ కాంబోలో సినిమా రానుంద‌ని టాక్‌.

More News

రీమేక్‌లో ర‌వితేజ‌?

ఈ మ‌ధ్య ర‌వితేజ జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్పేస్తున్నాడు. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్పుడు ర‌వితేజ హీరోగా గోపీచంద్

బన్నీ హీరోయిన్ పరిస్థితేంటి..? ఇలా త‌యారైంది

నానితో మ‌జ్ను సినిమాలో జ‌త క‌ట్టిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ ప్రారంభంలో మంచి అవ‌కాశాల‌నే అందిపుచ్చుకుంది.

"ఆదిత్యా థాక్రే.. సిగ్గుగా అనిపించట్లేదా..!?"

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ లాక్‌డౌన్ కీలక ప్రకటన చేస్తారని..

దేశంలోని సంపన్నులకు షా విన్నపం.. ప్రజలకు భరోసా!

మే-03వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఏప్రిల్-20 తర్వాత పరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు ఉంటాయని..

హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు..!

దక్షిణాది అందాల నటి.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన సీనియర్ నటి శ్రియ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లయిన తర్వాత స్పెయిన్‌లోనే భర్తతో కలిసి ఉంటోంది.