రామ్ దర్శకుడితో నాని?
Send us your feedback to audioarticles@vaarta.com
నేను శైలజ చిత్రంతో తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కిషోర్ తిరుమల. ప్రస్తుతం అదే చిత్ర కథానాయకుడు రామ్‌తో ఉన్నది ఒకటే జిందగీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఆడియో విడుదల కార్యక్రమం కూడా జరుపుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.
ఇదిలా ఉంటే.. ఉన్నది ఒకటే జిందగీ తరువాత కిషోర్ తిరుమల తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నానికి కిషోర్ ఓ కథ వినిపించాడని, కథ నచ్చడంతో నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కథనాలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించబోతున్నట్లు సమాచారమ్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.
ప్రస్తుతం నాని కథానాయకుడిగా ఎంసిఎ, కృష్ణార్జున యుద్ధం చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే నాగార్జునతోనూ ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నాడు నాని. శ్రీరామ్ ఆదిత్య దీనికి దర్శకత్వం వహించనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments