రామ్ హీరోయిన్ తో నాని..

  • IndiaGlitz, [Friday,June 03 2016]

రామ్ హీరోయిన్ తో నాని న‌టిస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ...రామ్ హీరోయిన్ ఎవ‌రంటారా..? నేను శైల‌జ చిత్రంలో రామ్ స‌ర‌స‌న న‌టించిన కీర్తి సురేష్. అవును...నాని చిత్రంలో కీర్తి సురేష్ న‌టిస్తుంద‌ట‌. నేను..శైల‌జ చిత్రంలో న‌టించిన కీర్తి సురేష్ తొలి చిత్రంతోనే విజ‌యం సాధించి మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. ఆత‌ర్వాత తెలుగులో అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుని బిజీ అవుతుంది అనుకున్నారు. కానీ..అలా జ‌ర‌గ‌లేదు. కోలీవుడ్ లో బిజీ అయిపోయింది.

అయితే....తాజాగా తెలుగులో నాని సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. సినిమా చూపిస్త మావ ఫేం త్రినాథ‌రావు దర్శ‌క‌త్వంలో నాని ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు - బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసార‌ని స‌మాచారం. ఈ సినిమాతోనైనా కీర్తి సురేష్ కి తెలుగులో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తాయేమో చూడాలి.

More News

'అఆ' శాటిలైట్ హక్కుల దక్కించుకున్న...

నితిన్,సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'అఆ'.

చంద్రశేఖర్ ఏలేటి మనమంతా కథ ఇదే..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,గౌతమి,కేరింత ఫేం విశ్వంత్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మనమంతా.

ముంబాయిలో నాగ అన్వేష్ పాటల రికార్డింగ్

నాగ అన్వేష్,హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కనున్న చిత్రం 'ఏంజిల్'.శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కనున్న

నాడు మాస్, జై చిరంజీవ - నేడు సర్ధార్, అ ఆ

మాస్,జై చిరంజీవ-సర్ధార్,అ ఆ...ఈ నాలుగు చిత్రాలకు ఉన్న లింకు ఏమిటి అని తెగ ఆలోచిస్తున్నారా..?