మనం డైరెక్టర్ తో నాని?
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రియ తొలి చిత్రం ఇష్టంతో దర్శకుడిగా పరిచయమైన విక్రమ్ కె. కుమార్.. ఇష్క్, మనం, 24 చిత్రాలతో తెలుగువారికి చేరువయ్యాడు. ప్రస్తుతం అఖిల్‌తో హలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అఖిల్ రీ లాంఛ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఆ రోజుకి ఒక రోజు ముందు నేచురల్ స్టార్ నాని నటించిన ఎం.సి.ఎ కూడా విడుదల కానుంది.
క్రిస్మస్ బరిలో విక్రమ్ కె.కుమార్, నాని సినిమాలు పోటీపడుతున్నప్పటికీ.. భవిష్యత్‌లో వీరిద్దరు ఒకే సినిమా కోసం పనిచేసే అవకాశముందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని ఎం.సి.ఎతో పాటు కృష్ణార్జున యుద్ధం కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు విక్రమ్ హలో కూడా పూర్తయ్యాకే వీరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కావచ్చని చెప్పుకుంటున్నారు. ఒకవేళ నాని, విక్రమ్ సినిమా ఓకే అయితే గనుక ఓ ఆసక్తికరమైన సినిమా తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నట్టే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com