డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడితో నాని?

  • IndiaGlitz, [Friday,July 06 2018]

ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్క‌డున్నాడు, ప్ర‌యాణం, సాహసం, మ‌న‌మంతా .. ఇలా వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. రెండేళ్ళ క్రితం విడుద‌లైన మ‌న‌మంతా చిత్రం త‌రువాత మ‌రో సినిమాని తెర‌కెక్కించ‌ని యేలేటి.. త్వ‌ర‌లోనే త‌న త‌దుప‌రి చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. నేచుర‌ల్ స్టార్ నాని ఈ సినిమాలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడ‌ని తెలిసింది. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించ‌బోతోంద‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశంతో కూడిన ఈ సినిమా స‌బ్జెక్ట్ నానికి ఎంత‌గానో న‌చ్చింద‌ని.. దేవ‌దాస్‌, జెర్సీ చిత్రాల త‌రువాత నాని నుంచి వ‌చ్చే సినిమా ఇదే అవుతుంద‌ని స‌మాచారం.

వాస్త‌వానికి.. మ‌నమంతా త‌రువాత యేలేటి త‌దుప‌రి చిత్రం సాయిధ‌ర‌మ్ తేజ్ ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌రువాత నితిన్ పేరు వినిపించింది. ఇప్పుడు నాని పేరు వెలుగులోకి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే యేలేటి నెక్ట్స్ ఫిల్మ్‌పై క్లారిటీ వ‌స్తుంది.