గుడాచారి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలి - నాని

  • IndiaGlitz, [Friday,July 27 2018]

'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గుడాచారి'.శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూడాచారి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ని ఇటీవల సమంత రిలీజ్ చేసారు.

ఈ టీజర్ కి సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఒక్క టీజర్ తోనే ఈ చిత్రం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్, ముఖ్యపాత్రల్లో నటించారు.బిజినెస్ పరంగా ఈ చిత్రానికి అన్ని ఏరియాలనుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేసారు. ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా ఆగష్టు ౩న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని అయన రిలీజ్ చేస్తున్నారు. కాగా గూఢచారి థియేట్రికల్ ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని జులై 27న అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో లంచ్ చేసారు.

ఈ కార్యక్రమంలో హీరో అడివి శేషు, హీరోయిన్ శోభిత, దర్శకుడు శశికిరణ్, మతాల రచయిత అబ్బూరి రవి, కెమెరామెన్ శనియేల్ డియో, నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంకర పాల్గొన్నారు. అనంతరం గూడాచారి థియేటర్ ట్రయిలర్ని నాని రిలీజ్ చేసారు.

నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - లాస్ట్ టైం నేను అర్జున్ రెడ్డి థియేటర్ ట్రైలర్ ని లంచ్ చేశాను. అది సూపర్ సక్సెస్ అయింది. శేషు టెర్రిఫిక్ పెర్ఫార్మర్. క్షణం తో పాటు కొన్ని సినిమాలు చూసాను. ఎందుకో తనకి రావాల్సిన గుర్తిపు రాలేదని నేను బాగా ఫీల్ అయ్యేవాడ్ని. ఆలోటు ఈ సినిమాతో తీరుతుంది. ఏది శేషుకి కరెక్ట్ సినిమా. రైట్ టైంలో వస్తుంది. అతను చాలా పాజిటివ్ పర్సన్. ఏ సినిమా గురించి అయినా సోషల్ మీడియాలో పాజిటివ్ గా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి శేషు సినిమాకి నా సపోర్ట్ ఉండాలని ఈ ఫంక్షన్ కి వచ్చాను. గూఢచారి ట్రైలర్ చూడగానే భూజ్ బమ్స్ వచ్చాయి. అదిరిపోయింది.

ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, రీ రికార్డింగ్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, అన్నీ ఎక్సట్రార్డినరీ గా వున్నాయి. ఏ బాషా చిత్రం అయినా మనం చూసినప్పడు బడ్జెట్ ఎంత అయింది ఎంతలో తీశారు అని మాట్లాడుకుంటాం. కానీ సినిమాకి కావాల్సింది బడ్జెట్ కాదు, క్లారిటీ. నాకు ఈ సినిమా టీజర్, ట్రైలర్ పిచ్చి పిచ్చిగా నచ్చాయి. ట్రైలర్ ఈ రేంజిలో ఉంటే రేపు సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి బ్లాక్ బస్టర్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో అడివి శేషు మాట్లాడుతూ - ఈ సినిమా టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏది ఎలాంటి సినిమా అని అందరికి డౌట్ ఉండేది. ఇప్పుడు ట్రైలర్ లో మా సినిమా కంటెంట్ ఏంటి అనేది చూపిస్తున్నాం. చాలా నెర్వస్ గా వుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మా టీమ్ ముఖ్య కారణం.

డైరెక్టర్ శశి, కెమెరామెన్ షానియేల్, ప్రతి ఒక్కరూ డే అండ్ నైట్ కస్టపడి వర్క్ చేసారు. ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ గూఢచారిగా మారితే ఎలా ఉంటుంది అనేది మా చిత్రం కాన్సెప్ట్. జెన్యూన్ గా ఈ ఫిలిం తీసాం. మా అందరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ ని లాంచ్ చేసిన నాని కి నా స్పెషల్ థాంక్స్ అన్నారు.

ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సుంకర మాట్లాడుతూ - టీమ్ అందరు ఒక కమిట్ మెంట్ తో వర్క్ చేసారు.ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవుతారు . ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడం చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్నాను అన్నారు.

More News

వెండితెరకు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ 'విశ్వదర్శనం'

దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె. విశ్వనాథ్‌ జీవితం వెండితెరపైకి రానుంది. 'విశ్వదర్శనం' పేరుతో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగాయి.

ఆగస్ట్‌ 10న కమల్‌హాసన్‌ 'విశ్వరూపం 2'

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన 'విశ్వరూపం' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

'పేపర్ బాయ్' టీజర్ కి అద్భుతమైన స్పందన

సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'..

విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం బ‌న్ని...

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో హీరోగా ఇమేజ్ సంపాదించుకున్న క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర కొండ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'గీత గోవిందం'.

'ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి' చిత్రీక‌ర‌ణ పూర్తి...

మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై తమన్నా, సిద్దు జొన్నలగడ్డ, జి.వి.ఎల్.నరసింహ రావ్, మాస్టర్ సంపత్ తారాగ‌ణంగా