close
Choose your channels

ఏబీసీడీ సినిమా మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను - నాని

Tuesday, May 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'. 'అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి' ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాకు క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. నేచుర‌ల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా..

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ - ``నాకు ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే పిల్ల జ‌మీందార్ సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఆ సినిమాను మంచి హిట్ ఏబీసీడీ సినిమా కావాల‌ని కోరుకుంటున్నాను. మ‌ధుర‌శ్రీధ‌ర్‌గారు నాకు మెసేజ్ చేసి చీఫ్ గెస్ట్‌గా ర‌మ్మ‌న్నారు. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. ఆ కార‌ణంగా ఈ వేడుక‌కి వ‌చ్చాను. శిరీష్‌లో ఓ చిన్న‌పిల్లాడు ఉండేవాడు. నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్న‌ప్పుడు శిరీష్‌ను అప్పుడ‌ప్పుడు క‌లిశాను. అప్పుడు త‌ను కాస్త లావుగా, బొద్దుగా ఉండేవాడు. త‌ను సినిమా బిజినెస్ గురించి చాలా మంచి ఆర్టిక‌ల్స్ రాసేవాడు. ప్రొడ‌క్ష‌న్‌లో అర‌వింద్‌గారికి మంచి స‌క్సెస‌ర్ దొరికాడ‌ని అనుకున్నాను. క‌ట్ చేస్తే త‌ను యాక్ట‌ర్ అయిపోయాడు. త‌న‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌. త‌న కెరీర్‌కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్‌, త‌న స్టార్ డ‌మ్‌కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ద‌ర్శ‌కుడు సంజీవ్‌కి ఆల్ ది వెరీ బెస్ట్‌. రుక్స‌ర్ మంచి పెర్ఫామ‌ర్‌. త‌న‌కు కూడా ఆల్ ది వెరీ బెస్ట్‌.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు డి.సురేష్ బాబు మాట్లాడుతూ - ``మ‌ధుర శ్రీధ‌ర్ నాకు మంచి స్నేహితుడు. అత‌నితో గ‌త కొంత‌కాలం నుండి ట్రావెల్ చేస్తున్నాను. శిరీష్ తాత‌య్య అల్లు రామ‌లింగ‌య్య‌గారి నుండి నాకు బాగా తెలుసు. అలాగే అర‌వింద్‌గారు నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాతో శిరీష్‌కు పెద్ద‌విజ‌యం ద‌క్కాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ `` ఈ సినిమాను తెలుగులో చేయ‌మ‌ని చెప్పింది నా క‌జిన్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. రెండేళ్ల క్రితం ఎలాంటి సినిమా చేస్తే బావుంటుంద‌నే డిస్క‌ష‌న్ వ‌చ్చింది. అప్పుడు రాంచ‌ర‌ణ్ ఏబీసీడీ సీడీ తెచ్చి ఇచ్చి ఈ క్యారెక్ట‌ర్ నీకు క‌రెక్ట్‌గా సూట్ అవుతుంది అని చెప్పాడు. స‌రేన‌ని చూశాను.నాకు కూడా సినిమా బాగుంది క‌దా! అనిపించింది. అయితే మంచి డైరెక్ట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ హౌస్ దొరక‌డానికి స‌మ‌య ప‌ట్టింది. ఈ సినిమాను చూస్తున్న‌ప్పుడు నాకు నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను చూస్తున్న‌ట్లు అనిపించింది. రియ‌ల్ లైఫ్ తండ్రి కొడుకులను తెర‌పై చూస్తున్న‌ట్లుగా అనిపించింది. మా నాన్న‌గారు కూడా గుర్తుకు వచ్చి రెండు, మూడు సార్లు న‌వ్వుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో హీరో డ‌బ్బు విలువ తెలియ‌కుండా పాడైపోయాడ‌ని భావించిన తండ్రి అత‌న్ని బాగు చేసుకోవ‌డానికి ఏం చేశాడ‌నేదే క‌థ‌.

నాకు 21 ఏళ్లు వ‌చ్చింది. బ‌న్నికి, రామ్‌చ‌ర‌ణ్‌కు 21 ఏళ్లు వ‌చ్చిన‌ప్పుడు కారు కొనిచ్చారు. నాకు 21 ఏళ్లు వ‌చ్చాయి కారు కొనివ్వ‌మ‌ని అడిగాను. ఏ కారు కావాలని నాన్న అన్నారు. మంచి స్పోర్ట్స్ కారు కావాల‌ని అన్నాను. ఆయ‌న చెప్పు ఇచ్చుకుని కొడ‌తాను. ఎందుకంటే నీ వ‌య‌సువాళ్లు ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. నీకు కారు కొనివ్వ‌డ‌మే ల‌గ్జ‌రీ. అలాంటిది స్పోర్ట్స్ కారు కొనివ్వ‌మ‌ని అడుగుతున్నావ్ అన్నారు. నాకు కారు కొనివ్వ‌లేదు. నీ కారు బ‌డ్జెట్ ఇంత అనుకుంటున్నాను అని అన్నారు. ఆరోజు కోపానికి పోయి, నాకు కారు వ‌ద్దులే. నా స్వంత డ‌బ్బుల‌తోనే కొనుక్కుంటానని అన్నాను. అయితే నేను ఆ కారు కొన‌డానికి నాకు మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. ఈ సినిమాలో నాగ‌బాబుగారు నా తండ్రి పాత్ర పోషించారు. నాకు అప్పుడు నాన్న చేసిన పని వ‌ల్ల డ‌బ్బు విలువ తెలిసి వ‌చ్చింది. కాబ‌ట్టి ఈ సినిమాను మా నాన్న‌కు డేడికేట్ చే్స్తున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు అర‌వింద ప్ర‌సాద్‌. మా నాన్న ఇన్‌స్పిరేష‌న్‌తోనే ఆ పేరు పెట్టుకున్నాను. ఎన్నారై యువ‌కుడైన నేను ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు డ‌బ్బులు లేకుండా ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాన‌నేదే సినిమా.

నాకు ముంబైలో చ‌దువుకున్న రోజులు గుర్తుకు వ‌చ్చాయి. చాలా ఎంజాయ్ చేస్తూ క్యారెక్ట‌ర్ చేశాను. సంజీవ్ మ‌ల‌యాళం నుండి చ‌క్క‌గా అడాప్ట్ చేశాడు. రామ్ సినిమాటోగ్ర‌ఫీగారు చ‌క్క‌టి విజువ‌ల్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జుడా సాండి .. నాకు ఈ జర్నీలో త‌ను మంచి మిత్రుడ‌య్యాడు. అలాగే మ‌ధుర శ్రీధ‌ర్‌గారు, య‌ష్ రంగినేని, ధీర‌జ్ మొగిలినేని అంద‌రూ చ‌క్క‌టి స‌పోర్ట్ అందించారు. నా కోస్టార్ భ‌ర‌త్ చాలా మంచి ాత్ర చేశాడు. మంచి కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేష‌న్ హిట్ కాంబినేష‌న్ అవుతుంది. నా తండ్రి పాత్ర‌లో నాగ‌బాబుగారు త‌ప్ప మ‌రెవ‌రినీ ఊహించుకోలేను. బివిఎస్ ర‌వి, స‌త్యానంద్‌, కృష్ణ‌చైత‌న్య‌, ప‌వ‌న్ సాధినేనికి థాంక్స్‌. రుక్స‌ర్ గ్లామ‌ర్‌తోనే కాదు.. పెర్ఫామెన్స్‌తో కూడా మెప్పిస్తుంది. స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``నేను మాట్లాడాల‌నుకున్న విష‌యాల‌ను ద‌ర్శ‌కుడు చెప్పేశాడు. కాబ‌ట్టి నేను పెద్ద‌గా మాట్లాడ‌టానికి ఏమీ లేదు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - ``ఈ సినిమాతో స్టార్టింగ్ నుండి ట్రావెల్ చేస్తూ చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న డి.సురేష్‌బాబుగారికి థాంక్స్. ఈ సినిమాలో ఐదు సీక్రెట్ సూప‌ర్‌హీరోస్ ఉన్నారు. బివిఎస్ ర‌వి, ప‌వ‌న్ సాధినేని, వాసువ‌ర్మ‌, కృష్ణ చైత‌న్య‌ల‌కు థాంక్స్‌. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లోని కాశీగారికి థాంక్స్‌. సుధీర్ వ‌ర్మ‌కి థాంక్స్‌. ఆర్ట్ డైరెక్ట‌ర్ వ‌ర్మ‌గారు.. బెస్ట్ సెట్స్ ఇచ్చారు. అలాగే న‌వీన్ నూలి సినిమాను చ‌క్క‌గా షేప్ అప్ చేశారు. అలాగే డైరక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌కి థాంక్స్ జుడా సాండి అద్భుత‌మైన సంగీతం, నేప‌థ్య సంగీతం అందించారు. ధీర‌జ్ ప్రొడ‌క్ష‌న్‌ని చ‌క్క‌గా హ్యాండిల్ చేశాడు. మ‌ధుర శ్రీధ‌ర్‌తో ట్రావెల్ చేసేట‌ప్పుడు మా నాన్న‌తో ఉన్న‌ట్లే అనిపించింది. అలాగే య‌ష్‌రంగినేనిగారికి థాంక్స్‌. అల్లు శిరీష్ సినిమాలోనే కాదు.. రియ‌ల్ లైఫ్ హీరో కూడా. శిరీష్‌గారు ఈ సినిమాలో ఎవ‌రికైనా డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చి ఉండొచ్చు. కానీ.. కొత్త డైరెక్ట‌ర్‌ని ప‌రిచ‌యం చేయాల‌నే ఉద్దేశంతో నాకు అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. శిరీష్ నాకు లైఫ్ లాంగ్ హీరోగా ఉంటారు`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ జుడా సాందీ మాట్లాడుతూ - ``తెలుగు ప్రేక్ష‌కులు నాపై చూపించిన అభిమానానికి, ప్రేమ‌కు థాంక్స్‌. రేపు సినిమా చూసిన త‌ర్వాత అంద‌రికీ న‌చ్చుతుంది. అల్లు శిరీష్‌తో ట్రావెల్‌ను మ‌ర‌చిపోలేను`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment