నాని తో సినిమాకు ముహుర్తం కుదిరింది...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి తరం యంగ్ హీరోస్ లో డిఫరెంట్ చిత్రాలతో ముందుకెళ్తున్న హీరో నాని. భలే భలే మగాడివోయ్ సక్సెస్ తర్వాత జెంటిల్ మన్ గా మరో సక్సెస్ అందుకున్నాడు. ఉయ్యాలా జంపాలా ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ వంటి స్టార్ టెక్నిషియన్ పనిచేస్తున్నాడు. యఈ సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ చేయడానికి ఎస్ చెప్పేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. ఈ సినిమాను స్వాతంత్యదినోత్సవ వేడుక రోజున అంటే ఆగస్ట్ 15న లాంచనంగా ప్రారంభిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments