సల్మాన్ తో నాని విలన్...
- IndiaGlitz, [Wednesday,March 22 2017]
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఏక్‌థా టైగర్ సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. ఇప్పుడు ఏక్‌థా టైగర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం టైగర్ జిందా హై. ఈ సినిమాలో కూడా సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్‌లు జంటగా నటించబోతున్నారు.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కన్నడ స్టార్ సుదీప్ విలన్‌గా నటించే అవకాశాలున్నాయని టాక్ వినపడుతుంది. తెలుగులో సుదీప్ రాజమౌళి దర్శకత్వంలో ఈగ చిత్రంలో విలన్‌గా నటించాడు. ఇప్పుడు సల్మాన్‌ఖాన్ సినిమాలో విలన్‌గా నటించబోతున్నాడన్నమాట. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.