నాని,విక్రమ్ కుమార్ మూవీ డిటైల్స్
Send us your feedback to audioarticles@vaarta.com
వరుసగా ఆరు విజయాలను అందుకుని డబుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు త్రిపుల్ హ్యాట్రిక్‌కి ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఆ చిత్రమే.. ఈ నెల 21న రాబోతున్న ఎం.సి.ఎ. సినిమా. దాంతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నటిస్తున్నారు నాని.
ఈ మూవీకి సంబంధించి.. మరో 20 రోజుల్లో షూటింగ్ పూర్తవబోతోంది. వచ్చే వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి యూనిట్ భావిస్తోంది. వీటితో పాటు నాగార్జున చేయబోయే మల్టీస్టారర్ మూవీ ఒకటుంది.అలాగే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఒకటి నాని కోసం సిద్ధంగా ఉంది. నాని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఒక కథను నానికి వినిపించడం జరిగిందని సమాచారం.
కథ నచ్చడంతో నాని కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల నిర్మిస్తున్నారని సమాచారం. 'కృష్ణార్జున యుద్ధం' చిత్రం పూర్తైన వెంటనే.. విక్రమ్ సినిమాని పట్టాలెక్కిస్తారని నాని సన్నిహిత వర్గం చెబుతున్నారు. విక్రమ్ కుమార్ తాజా చిత్రం 'హలో' ఈ నెల 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com