నాని, విక్ర‌మ్ కె.కుమార్‌.. ఓ థ్రిల్ల‌ర్ మూవీ?

  • IndiaGlitz, [Tuesday,April 17 2018]

వరుస విజయాలతో పాటు.. వరుస సినిమాల‌తో నేచుర‌ల్ స్టార్‌ నాని కెరీర్ ప్రెజెంట్ పీక్స్‌లో ఉంది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో కింగ్ నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు నాని. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి, అవసరాల శ్రీనివాస్, విక్రమ్ కె.కుమార్‌తో ఈ యువ క‌థానాయ‌కుడు త‌న త‌దుప‌రి సినిమాలు చేయనున్నట్టు సమాచారం.

అయితే ఈ ముగ్గురిలో విక్రమ్ కె.కుమార్ సినిమానే ముందుగా సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి నాని మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. ఎవరూ ఊహించని ట్విస్ట్‌లతో కథలను తెరకెక్కించడంలో ద‌ర్శ‌కుడు విక్రమ్ కె.కుమార్ సిద్ధ‌హ‌స్తులు.ఇక థ్రిల్లర్ ఫిల్మ్ అనగానే విక్ర‌మ్‌.. మ‌రోసారి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ను చాటుతార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం నాని నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ పూర్తైన వెంటనే.. ఈ చిత్రం పట్టాలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నాని తాజా చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' గ‌త గురువారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.