నాని, త్రివిక్రమ్ చిత్రానికి నిర్మాత ఎవరంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరలోగానీ.. వచ్చే ఏడాది ప్రథమార్థంలోగానీ సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్నారు.భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం నాని.. నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశముంది. ఇక త్రివిక్రమ్ తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments