నాని, త్రివిక్రమ్ చిత్రం అప్పుడేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ కథనాలపై అటు త్రివిక్రమ్ గానీ.. ఇటు నాని గానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే వీరి కాంబినేషన్లో సినిమా రావడం ఖాయమని వినిపిస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ'తో బిజీగా ఉన్నారు. ఆ తరువాత వెంకటేష్ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారు. ఆ చిత్రంతో పాటే నాని సినిమాని చేస్తారా? లేదంటే వెంకీ చిత్రం పూర్తయ్యాకే ఈ సినిమా చేస్తారా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలోనే సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్.. నానితో చేయబోయే చిత్రాన్ని బయట సంస్థలో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడుతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments