నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ చిత్రం!
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని 24వ సినిమాను ప్రకటించేశారు. '13బి', 'ఇష్క్', 'మనం', '24', 'హలో' చిత్రాలకు దర్శకత్వం వహించి.. సెన్సిబుల్, సక్సెస్ఫుల్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం'... వరుసగా సెన్సేషనల్ హిట్స్ తో హ్యాట్రిక్ అందుకున్న భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీఎం) ఈ సినిమాకు నిర్మాతలు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కె కుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ అనగానే ఇటు చిత్రవర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి నాని ఆదివారం ట్విట్టర్లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు
నాని ట్విట్టర్ లో "నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరం లో. గర్ల్స్!! దిస్ ఒన్స్ ఫర్ యు " అని పోస్ట్ చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ "మన నేచురల్ స్టార్ నాని హీరోగా, సక్సెస్ఫుల్ డైరక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మా సంస్థలో సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
విజువల్స్ తో వండర్లు చేసే పీసీ శ్రీరామ్‌గారు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణుల పేర్లనును వెల్లడిస్తాం. ఫిబ్రవరి 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం" అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com