గుడ్ న్యూస్ చెప్పబోతున్న నాని..!
- IndiaGlitz, [Saturday,November 19 2016]
నేచురల్ స్టార్ నాని త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట. నాని చెప్పే గుడ్ న్యూస్ తన సినిమాలకు సంబంధించి కాదు. మరి..ఏమిటంటే... నాని త్వరలో తండ్రి కాబోతున్నాడట. 2012లో విశాఖపట్నంకు చెందిన అంజనను నాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాని భార్య అంజన ప్రస్తుతం ప్రగ్నెంట్ అట. మరో రెండు నెలల్లో డెలివరీకి డాక్టర్స్ డేట్ ఇచ్చారని తెలిసింది.
సోషల్ మీడియాలో ఏక్టీవ్ గా ఉండే నాని మాత్రం ఈ విషయాన్ని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అయితే...నాని క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం తెలుసట. ఇక నాని సినిమాల విషయానికి వస్తే...నాని హీరోగా డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రాన్ని ఈనెల 23న ప్రారంభిస్తున్నారు. నేను లోకల్ చిత్రాన్ని డిసెంబర్ 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.