విలన్ గా నాని
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలను సాధిస్తున్న యువక కథానాయకుడు నాని. ఇప్పుడు `నిన్ను కోరి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా సినిమా రూపొందిన ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత నాని దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.
మేర్లపాక గాంధీ సినిమాలో నాని డబుల్ రోల్ చేస్తాడని సమాచారం. ఇందులో ఓ రోల్‌కు నెగటివ్ షేడ్ ఉంటుందట. గతంలో నాని జెండాపై కపిరాజు అనే సినిమాలో కూడా డబుల్ రోల్ చేశాడు. అందులో ఒక రోల్ నెగటివ్ టచ్‌తో సాగి చివర్లో పాజిటివ్‌గా మారుతుంది. ఇప్పుడు మేర్లపాక గాంధీ నానితో డబుల్ రోల్ మూవీ చేస్తున్నా, ఎలాంటి బ్యాక్ డ్రాప్లో సినిమా ఉంటుందోనని చూడాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com