నానితో హైబ్రీడ్ పిల్ల..?
Send us your feedback to audioarticles@vaarta.com
నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా ట్రాక్ ఎక్కడానికి మాత్రం మరింత సమయం పట్టేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ మూవీలో నాని జతగా సాయి పల్లవి నటించనుందట. గతంలో వీరిద్దరూ కలిసి ఏంసీఏ చిత్రంలో నటించారు. అంతా అనుకునట్లు జరిగితే ఈ సక్సెస్ఫుల్ జోడీ మరోసారి తెరపై ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది.
ప్రస్తుతం రానా దగ్గుబాటితో సాయిపల్లవి `విరాటపర్వం` సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శర్వానంద్‌తో ఈ చెన్నై బ్యూటీ నటించిన చిత్రం పడి పడి లేచె మనసు 2018లో విడుదలైంది. ఆ తర్వాత ఈమె తెలుగులో నటించనే లేదు. 2019లో ఒక మలయాళ సినిమా, సూర్య తమిళ చిత్రం ఎన్జీకేలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏ సినిమా కూడా ఈమెకు సక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు దాదాపు తెలుగు ప్రేక్షకులకు ఈమె డిస్కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. మరి విరాటపర్వం.. తర్వాత చేయబోయే నాని సినిమాతో అయినా తెలుగులో సక్సెస్ సాధిస్తుందేమో చూడాలీ హైబ్రీడ్ పిల్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments