నాని.. వారితోనే ఆరు వరుస సినిమాలు
Send us your feedback to audioarticles@vaarta.com
భలే భలే మగాడివోయ్ నుంచి నిన్ను కోరి వరకు వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు ఎం.సి.ఎ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు చేస్తున్నాడు. ఎం.సి.ఎ ఈ డిసెంబర్లో విడుదల కానుండగా.. కృష్ణార్జున యుద్ధం వచ్చే ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. జెంటిల్మాన్ నుంచి నాని సినిమాలను పరిశీలిస్తే.. ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
అదేమిటంటే.. వరుసగా ఆరు చిత్రాల్లో ఆయన కేరళకు చెందిన హీరోయిన్లతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నాడని. జెంటిల్మాన్లో నివేదా థామస్, మజ్నులో అను ఇమ్మానియేల్, నేను లోకల్లో కీర్తి సురేష్, నిన్ను కోరిలో నివేదాతో మరోసారి కలిసి నటించిన నాని.. తాజా చిత్రాలు ఎం.సి.ఎలో సాయిపల్లవి, కృష్ణార్జున యుద్ధంలో అనుపమ పరమేశ్వరన్తో యాక్ట్ చేస్తున్నాడు. వీరు కూడా మలయాళ ముద్దుగుమ్మలే.
సో.. నాని వరుసగా ఆరు చిత్రాలు కేరళకుట్టిలతోనే చేస్తున్నాడన్నమాట. అన్నట్టు.. నానికి కలిసొచ్చిన హీరోయిన్ల జాబితాలో కూడా కేరళ ముద్దుగుమ్మలదే ప్రథమస్థానం. నిత్యా మీనన్‌తో ఈ సక్సెస్ జర్నీ స్టార్ అయ్యింది నానికి. మున్ముందు కూడా నాని ఈ రూట్‌ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com