సిద్ధార్థ డైరెక్ట‌ర్‌తో నాని

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

సిద్దార్థ‌, శృతిహాస‌న్‌, హ‌న్సిక‌ల‌తో రూపొందిన సినిమా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుని ద‌ర్శ‌కుడు వేణు శ్రీరాంకు నిరాశ ఫ‌లితాన్నిచ్చింది. వేణుశ్రీరాం చాలా కాలం వ‌ర‌కు సినిమాలు లేకుండా ఖాళీగానే ఉన్నాడు.

ఇప్పుడు మ‌రో క‌థ‌ను సిద్ధం చేసి రీసెంట్‌గా నానికి వినిపించాడ‌ట‌. నానికి కూడా క‌థ న‌చ్చింద‌ని, సినిమా చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప్ర‌స్తుతం నాని, త్రినాథ్‌ల‌తో నేను లోక‌ల్ సినిమాను నిర్మిస్తున్న నిర్మాత దిల్‌రాజు బ్యాన‌ర్‌లోనే నాని, వేణు శ్రీరాం సినిమా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.