‘వి’ హాడ్ ఏన్ అనౌన్స్‌మెంట్ అంటూ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న నాని
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని చాలా కాలం తర్వాత మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల కోసం మంచి సర్‌ప్రైజ్‌ను అయితే అందివ్వబోతున్నట్టు నాని మాటలను బట్టి తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో థియేటర్లు లేవు.. సినిమాలూ లేవు. ఈ నేపథ్యంలో థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మాత్రం మన ఇంటికే తీసుకొస్తానని నాని వెల్లడించాడు. ఓ వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా ఓటీటీలో విడుదల డేట్‌ను కూడా నాని అనౌన్స్ చేసి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తాడని టాక్.
నాని హోమ్ థియేటర్‌లో సినిమా చూస్తూ.. ‘‘అదిరింది. అయిపోయింది.. అయిపోతే ఏమైంది మళ్లీ చూస్తా.. మళ్లీ మళ్లీ చూస్తా.. నాకిష్టమొచ్చినన్ని సార్లు చూస్తా.. రండి.. అదేంటి థియేటర్ ఇంటికొచ్చింది అనుకుంటున్నారా? థియేటర్ ఇంటికి వచ్చినా రాకపోయినా.. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఇంటికి రాబోతోంది. మన ఇల్లే థియేటర్‌గా మారబోతోంది. మళ్లీ మిడ్‌నైట్ షోలు పడబోతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో హడావుడి స్టార్ట్ అవబోతోంది. రిలీజ్ ముందుండే ఆ టెన్షన్.. నెర్వస్‌నెస్.. చాలా మిస్ అయ్యా. ఆ ఎక్సైట్‌మెంట్ అంతా మీరూ మిస్ అయ్యారని తెలుసు. అందుకే ‘వి’ హ్యాడ్ ఏన్ అనౌన్స్‌మెంట్’’ అని వెల్లడించాడు.
ప్రైమ్‌కు.. ‘వి’ చిత్రం..!
నాని అప్‌కమింగ్ మూవీ ‘వి’చిత్రం గురించి అందరికీ తెలిసిందే. యంగ్ హీరో సుధీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తెరకెక్కించారు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. నానికి ఇది 25వ చిత్రం కాగా.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఇది మూడో సినిమా. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25నే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌కు అమ్మేసినట్టు తెలుస్తోంది. రూ.30-35 కోట్లకు ఈ చిత్రాన్ని ప్రైమ్ కొనేసిందని టాక్ నడుస్తోంది. అంతే కాదు ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout