మూడేళ్లుగా నాని అలాగే..

  • IndiaGlitz, [Sunday,August 06 2017]

వ‌రుస విజ‌యాల‌తో యువ క‌థానాయ‌కుడు నాని త‌న హ‌వాని చాటుకుంటున్నాడు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లుకుని నిన్ను కోరి వ‌ర‌కు వ‌రుస‌గా ఏడు విజ‌యాల‌తో ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అంతేకాదండోయ్‌.. మూడేళ్లుగా ఏడాదికి త‌న నుంచి (హీరోగా) మూడేసి సినిమాలు విడుద‌ల‌య్యేలా బాగానే ప్ర‌ణాళిక‌లు వేస్తున్నాడీ టాలెంటెడ్ సెన్సేష‌న్‌.

2015లో జెండాపై క‌పిరాజు, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌.. 2016లో కృష్ణ‌గాడి వీర‌ప్రేమగాథ‌, జెంటిల్‌మేన్‌, మ‌జ్నుఅంటూ మూడేసి చిత్రాల‌తో సంద‌డి చేసిన నాని.. ఈ ఏడాదిలో ఇప్ప‌టికే నేను లోక‌ల్‌, నిన్ను కోరి చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు. ఇక ఈ ఏడాది చివ‌ర‌లో ఎం.సి.ఎ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. మొత్తానికి మూడేళ్లుగా ప్ర‌తి సంవ‌త్స‌రం మూడేసి సినిమాలు చేస్తూ.. స‌క్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ని మ‌లుచుకుంటున్న నాని.. మున్ముందు కూడా అదే బాట‌లో ప‌య‌నించాల‌ని ఆశిద్దాం.