బిగ్ డెసిషన్.. నాని 'టక్ జగదీష్' డైరెక్ట్ ఓటిటి రిలీజ్!
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ కారణంగా ప్రజలు కష్ఠాలు ఎదుర్కొంటున్నారు. సినిమారంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. వందలకోట్ల టాలీవుడ్ బిజినెస్ ని తారుమారు చేసింది. సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గాక టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమాన్యాలు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: నిహారిక భర్త చైతన్యపై పోలీస్ కంప్లైంట్.. అర్థరాత్రి న్యూసెన్స్, ఇంట్లో గొడవ!
తెలంగాణాలో థియేటర్లు తెరుచుకున్నాయి. ఏపీలో కూడా థియేటర్స్ 50 శాతం అక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చని ప్రభత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఏపీలో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ రేట్లతో థియేటర్లు నడపడం సాధ్యం కాదని కొందరు ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. దీనితో ఏపీలో పాక్షికంగానే థియేటర్లు తెరుచుకున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తమ చిత్రాలని థియేటర్లలో రిలీజ్ చేయడం సాధ్యం కాదనే ఫీలింగ్ నిర్మాతల్లో ఉంది. అందులో భాగంగానే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. శివ నిర్వాణ, నాని కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది.
చాలా రోజుల క్రితమే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఎలాగైనా సినిమాని థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్మాతలు ఇంతకాలం ఎదురుచూశారు. ఇప్పుడు కూడా థియేట్రికల్ రిలీజ్ కు పరిస్థితులు సహకరించడం లేదు.
దీనితో టక్ జగదీశ్ చిత్రాన్ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ నుంచి టక్ జగదీష్ చిత్రానికి బిగ్ డీల్ కుదిరిందని టాక్. ఈ చిత్రానికి అమెజాన్ దాదాపు రూ 45 కోట్లు ఆఫర్ చేసిందని వినికిడి. సెప్టెంబర్ లో వినాయక చవితి కానుకగా టక్ జగదీశ్ చిత్రం ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. నాని చివరగా నటించిన 'వి' కూడా కోవిద్ కారణంగా ఓటిటి అమెజాన్ లోనే విడుదలయింది. టికెట్ ధరలు, కోవిడ్ కారణంగా ఇంకెన్ని టాలీవుడ్ చిత్రాలు ఓటిటిలో రిలీజ్ కానున్నాయో!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments