విక్ర‌మ్ కుమార్‌కు నో చెప్పిన నాని

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. అయితే ఇటీవ‌ల‌ విడుద‌లైన హ‌లో నిరాశ‌ప‌రిచింది. కాగా.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని నేచుర‌ల్ స్టార్ నానితో చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. నాని కూడా ఇటీవ‌ల ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు.  తాజా స‌మాచారం ప్రకారం ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని తెలిసింది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. చాలా రోజుల క్రితం నానికి మంచి పాయింట్ చెప్పి   గ్రీన్ సిగ్న‌ల్ పొందిన విక్ర‌మ్‌.. ఇటీవ‌ల నానికి ఫుల్ స్క్రిప్ట్ నేరేట్ చేశార‌ట‌.

అయితే.. పూర్తి స్క్రిప్ట్ సంతృప్తి ప‌ర‌చ‌క‌పోవ‌డంతో.. విక్ర‌మ్ కుమార్ ప్రాజెక్ట్‌ను నాని సున్నితంగా తిర‌స్క‌రించార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మ‌ధ్య వ‌రుస విజ‌యాల‌తో స్పీడ్ మీదున్న నానికి.. తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం రూపంలో ప‌రాజ‌యం ఎదుర‌య్యింది. ఈ నేప‌థ్యంలో.. త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే.. విక్ర‌మ్ చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో నో చెప్పార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం నాని.. నాగార్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

More News

రామ్‌తో తొమ్మిదేళ్ళ త‌రువాత‌..

యువ క‌థానాయ‌కుడు రామ్ ప్ర‌స్తుతం హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

దేవిశ్రీ విష‌యంలో ఈసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

యంగ్ హీరో రామ్‌కు క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు.

మ‌హేశ్ 25వ చిత్రం అప్‌డేట్‌

తాజాగా భ‌ర‌త్ అనే నేను సినిమా రూపంలో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

డ‌ల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు

డ‌ల్లాస్ లో తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ అండ్ ఫిలింస్టార్స్ ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు బ్ర‌హ్మాండంగా, అంగ‌రంగ వైభంగా జ‌రిగాయి.

కాజ‌ల్‌కు రెండో సారి క‌లిసొస్తుందా?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు గ‌త ఏడాది మంచి విజ‌యాలే ద‌క్కాయి. ముఖ్యంగా.. మెగాస్టార్ చిరంజీవితో తొలిసారిగా క‌లిసి న‌టించిన ఖైదీ నెం.150 ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్