నాని.. నో రెమ్యున‌రేష‌న్‌

  • IndiaGlitz, [Tuesday,October 30 2018]

నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజ‌న్‌తో పాటు.. రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌' కాగా.. మ‌రోటి 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఇందులో క‌న్నడ హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ నాని జ‌త‌గా న‌టిస్తుంది. ఈ సినిమా క్రికెట్ నేప‌థ్యంలో ఎక్కువ‌గా సాగుతుంది. కాబ‌ట్టి విజువ‌ల్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. అందుకోసం బ‌డ్జెట్‌లో సినిమాను పూర్తి చేయాలంటే త‌న రెమ్యున‌రేష‌న్‌ను తీసుకోకూడ‌ద‌ని నాని నిర్ణ‌యించుకున్నాడ‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

సినిమా అవుట్‌పుట్ కోసం హీరో అలా చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ఈ చిత్రంలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ షేడ్స్‌లో నల‌బై ఏళ్లు వ‌యసున్న వ్య‌క్తిగా కూడా నాని క‌నిపిస్తాడ‌ట‌. ఇంత‌కు ముందు 'ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు' చిత్రంలో నాని మూడు షేడ్స్‌లో న‌టించినా.. న‌ల‌బై ఏళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌లేదు. అయితే 'జెర్సీ'లో మ‌ధ్య వ‌య‌స్కుడిగా క‌న‌ప‌డ‌నుండ‌టం విశేషం.