Saripodhaa Sanivaaram:ఇలాంటి పిచ్చోడిని ఎవరైనా చూశారా?.. 'సరిపోదా శనివారం' గ్లింప్స్ విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇటీవల విడుదలైన 'దసరా' మూవీ బ్లాక్‌బాస్టర్ కాగా.. 'హాయ్ నాన్న' చిత్రం డీసెంట్ హిట్‌గా నిలిచింది. తాజాగా 'అంటే సుందరానికి' లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' చిత్రంలో నటిస్తున్నాడు. DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. ఇందులో ప్రియక మోహన్ హీరోయిన్‌గా.. SJ సూర్య పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై టైటిల్ గ్లింప్స్ వీడియో ఆకట్టుకుంది.
తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. SJ సూర్య వాయిస్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతోంది. "కోపాలు రకరకాలు.. ఒక్కో మనిషికి కోపం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. పేరు.. సూర్య, రోజు.. శనివారం" అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
సూర్య పాత్రలో నాని కనిపిస్తుండగా.. తన కోపాన్ని మొత్తం కేవలం శనివారమే మాత్రమే చూపిస్తాడు. అయితే శనివారం మాత్రమే నానికి కోపం ఎందుకు వస్తుంది? మిగతా రోజులు నార్మల్‌గా ఎందుకు రియాక్ట్ అవుతాడు? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. దీనిని బట్టి ఈ సినిమా మాస్ కమర్షియల్ సినిమాలా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక జేక్స్ బేజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com