"తప్పు అనిపిస్తే ఆ దేవుడినైనా ఎదురించేయ్’’... రెండు పాత్రల్లో నాని అదుర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల విషయంలో నేచురల్ స్టార్ నాని దూకుడు పెంచారు. ఇప్పటికే టక్ జగదీశ్‌తో పర్వాలేదనిపించుకున్న ఆయన తాజాగా నటించిన చిత్రం ‘‘శ్యామ్ సింగరాయ్’’. ఈ చిత్రాన్ని హారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర మీద వెంకట్ బోయనపల్లి నిర్మించగా.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. 1970లలో కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కెరీర్‌లో తొలిసారి నాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ తన సినిమాను ఒకేసారి విడుదల చేస్తుండం విశేషం. ఈ రోజు వరంగల్‌లో ‘‘శ్యామ్ సింగరాయ్’’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది.
ఇందులో నాని రొమాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొట్టేశాడు. ఇక మరీ ముఖ్యంగా కృతి శెట్టి, నానిల మధ్య మంచి రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతోన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వాసు(నాని).. సినిమాలపై ఇష్టంతో.. దర్శకుడిగా రాణించాలని భావిస్తూ వుంటాడు. చిన్న బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తుంటాడు. కృతి శెట్టి అతని హీరోయిన్. సినిమా తీసే క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు వాసు.
అనుకోని ఓ ఇన్సిడెంట్ కారణంగా అతను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు శ్యామ్‌సింగరాయ్ పాత్ర తెరపైకి వస్తుంది.
మరి శ్యామ్‌సింగరాయ్‌కి, వాసుకి సంబంధం ఏంటి..? మధ్యలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ క్యారెక్టర్లు ఏంటీ అనేది తెలుసుకోవాలంటే సినిమా చూసేయాల్సిందే. వాసు అనే ఫిల్మ్ డైరెక్టర్‌గా.. శ్యామ్ సింగ రాయ్‌గా నాని డ్యూయల్ రోల్‌లో చితక్కొట్టాడు. ‘‘ నువ్ ఆ గుడిసే జోలికి వెళ్తే.. నీ ఇళ్లు ఎక్కడుందో ఈ శ్యాం సింగ రాయ్‌కి తెలుసు.. ‘‘తప్పు అనిపిస్తే ఆ దేవుడిని కూడా ఎదురించడంలో తప్పే లేదు.. అనే డైలాగ్‌లతో నాని అదరగొట్టేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments