"ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే" : శ్యామ్ సింగరాయ్ లిరికల్ సాంగ్ అదరహో
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. 1970లలో కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా శనివారం ఉదయం ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌ను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
కాగా.. ఈ దీపావళి సందర్భంగా హీరోయిన్ మడోన్నా పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు. దీంతో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత నాని ఓ పోస్ట్ కూడా చేశాడు. దాంట్లో ముగ్గురు కథానాయికల గురించి చెప్పేశాడు. మెమోరీ కృతి శెట్టి, టైం సాయి పల్లవి, ట్రూత్ మడోన్నా సెబాస్టియన్ అని కామెంట్ చేశాడు. అంటే ఈ ముగ్గురు హీరోయిన్‌లలో ఒకరు ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ అని తెలుస్తోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే కథాంశంగా ‘శ్యామ్ సింగ రాయ్’’ తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments