'కృష్ణార్జున యుద్ధం'లో నాని పాత్రలేమిటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలు. మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళా సంగీతమందిస్తున్నాడు. కాగా, శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి చిన్న అంతరాయం కలిగింది.
ఇటీవల నాని ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురి అవడంతో.. అతనికి చిన్న చిన్న గాయాలయ్యాయి. తను క్షేమంగానే ఉన్నానని.. వారం రోజుల తరువాత తిరిగి యాక్షన్‌లోకి రాబోతున్నానని ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు నాని. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ చిత్రంలో నాని రెండు విభిన్న పాత్రలకి సంబంధించిన లుక్స్‌ని చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అందులో ఒకటి ఫారిన్లో ఉండే రాక్ స్టార్ పాత్ర కాగా...రెండవది రాయలసీమలో దొంగ పాత్ర అని తెలిసింది. గతంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'హలో బ్రదర్'లోనూ ఈ తరహా పాత్రలే ఉన్నాయి. మరి వాటి నుంచి స్ఫూర్తి తీసుకుని.. కొత్త తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారేమో చూడాలి. ఏప్రిల్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com