బిగ్‌బాస్‌పై నాని స్పంద‌న‌...

  • IndiaGlitz, [Tuesday,October 02 2018]

బిగ్‌బాస్ సీజ‌న్ 2కు నాని వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో నాని వ్యాఖ్యానంపై ... త‌న ప్ర‌వ‌ర్త‌న‌పై చాలా ర‌కాలైన విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నాడు నాని. గ‌త ఆదివారం బిగ్‌బాస్ సీజ‌న్ 2 ముగిసింది. ఫైన‌ల్ విన్న‌ర్‌గా కౌశ‌ల్ ఎంపిక‌య్యాడు. ఈ సీజ‌న్ ముగియ‌డంతో అంద‌రి కంటే ఎక్కువ‌గా నాని సంతోష ప‌డుతున్నాడు.

అందుకు కారణం.త‌ను ఎదుర్కొన్న విమ‌ర్శ‌లే. ''మూడు సినిమాల‌ను ఒకే ఏడాదిలో చేసినా రాని మాన‌సిక ఒత్తిడి బిగ్‌బాస్ సీజ‌న్ 2కి వ‌చ్చింది. నేను ఓ చిన్న ప్ర‌పంచంలో బ్ర‌తికేవాడిని. కానీ బిగ్‌బాస్ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా చేయ‌డం వ‌ల్ల కొత్త ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది. ఇంత ద్వేషంతో కూడిన విమ‌ర్శ‌ల‌ను ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇన్ని ర‌కాల మ‌న‌స్త‌త్వాలున్న మ‌నుషులుంటారా? అనిపించింది'' అని నాని ఓ మీడియాతో అన్నారు.