బిగ్‌బాస్‌పై నాని స్పందన...
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 2కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నాని వ్యాఖ్యానంపై ... తన ప్రవర్తనపై చాలా రకాలైన విమర్శలను ఎదుర్కొన్నాడు నాని. గత ఆదివారం బిగ్‌బాస్ సీజన్ 2 ముగిసింది. ఫైనల్ విన్నర్‌గా కౌశల్ ఎంపికయ్యాడు. ఈ సీజన్ ముగియడంతో అందరి కంటే ఎక్కువగా నాని సంతోష పడుతున్నాడు.
అందుకు కారణం.తను ఎదుర్కొన్న విమర్శలే. ``మూడు సినిమాలను ఒకే ఏడాదిలో చేసినా రాని మానసిక ఒత్తిడి బిగ్‌బాస్ సీజన్ 2కి వచ్చింది. నేను ఓ చిన్న ప్రపంచంలో బ్రతికేవాడిని. కానీ బిగ్‌బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేయడం వల్ల కొత్త ప్రపంచం పరిచయమైంది. ఇంత ద్వేషంతో కూడిన విమర్శలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇన్ని రకాల మనస్తత్వాలున్న మనుషులుంటారా? అనిపించింది`` అని నాని ఓ మీడియాతో అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com