రిపీట్ చేసిన నాని
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు నాని. తాజాగా ఎం.సి.ఎ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)తో మరో విజయాన్ని అందుకున్నాడు ఈ నేచురల్ స్టార్. డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా.. వసూళ్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. గతేడాది నాని హీరోగా నటించిన మూడు చిత్రాలు విడుదలై హ్యాట్రిక్ విజయాన్ని అందించాయి. కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్‌మన్, మజ్ను.. ఇలా నిరుడు నాని చేసిన మూడు సినిమాలు కూడా విజయం సాధించాయి.
కట్ చేస్తే.. ఈ ఏడాది కూడా నాని హీరోగా మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తే.. అవి కూడా కమర్షియల్‌గా మంచి సక్సెస్ అయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన నేను లోకల్ తో పాటు నిన్ను కోరి, ఎం.సి.ఎ చిత్రాలు కూడా విజయపథంలో పయనించి.. ఈ ఏడాదిలోనూ ఈ నేచురల్ స్టార్‌ని హ్యాట్రిక్ హీరో చేసాయి. మొత్తానికి 2016 మాదిరిగానే 2017లోనూ నాని హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com