సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య టీజర్ రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంకర్ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ తో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన చిత్ర టీజర్ ని... నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య చిత్ర టీజర్ ను రిలీజ్ చేసిన నానికి స్పెషల్ గా మా చిత్రర యూనిట్ తరపున ప్రత్యేంకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సందీప్ కిషన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. మెహ్రీన్ కు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ తో పాటు ఓ యూనిట్ పాయింట్ ను ఇందులో చెప్పబోతున్నాం. ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది. త్వరలోనే భారీ ఈవెంట్ తో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం. అని అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య షూటింగ్ దశలోనే నాకు పూర్తి సంతృప్తి ఇచ్చిన చిత్రం. అలాంటి చిత్ర టీజర్ ను నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన నాని రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి, ఫిలిం ఇండస్ట్రీ నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. సుశీంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శివ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ తో వర్క్ చేయడం నిజంగా కొత్త అనుభూతినిచ్చింది. ప్రతీ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపించబోతున్నాను. ప్రతీ సీన్, ప్రతీ ఎమోషన్ ప్రతీ ఒక్కరినీ టచ్ చేస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మెహ్రీన్ సూపర్ యాక్ట్రెస్. ఆమెకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. ఇమ్మాన్ మ్యూజిక్ మరో లెవల్ కు తీసుకెళ్తుంది. త్వరలోనే కేరాఫ్ సూర్య చేయబోయే భారీ ఈవెంట్ లో మరిన్ని విశేషాలు తెలియజేస్తాను. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments