నాని కూడా వస్తున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నాని నందమూరి నటసింహాం బాలయ్య ఫ్యాన్ గా నటిస్తున్నాడు. అందుచేత ఈ సినిమాకి జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరిగింది.అయితే ఆతర్వాత ఆ టైటిల్ కాదని నాని తెలియచేసాడు.
ఇదిలా ఉంటే...నవంబర్ నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసి... క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. క్రిస్మస్ కి కూడా పోటీ ఎక్కువైంది. మరి...భలే భలే మగాడివోయ్ మూవీతో సక్సెస్ సాధించిన నాని ఈ మూవీతోకూడా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments