నాని అసలు పేరు.....
- IndiaGlitz, [Tuesday,September 06 2016]
ఎనిమిదేళ్ళ ముందు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో విడుదలైన అష్టాచమ్మా చిత్రంతో హీరోగా పరిచయమైన నాని తొలి చిత్రంలోనే తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసిన నాని, అనుకోకుండా అష్టాచమ్మాతో హీరో కావడం, ఆ సక్సెస్తో వరుస అవకాశాలు వచ్చాయి.
సినిమాలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందడంతో ఇప్పుడు తను బిజీ హీరోగా మారిపోయాడు. అయితే తన ముద్దు పేరునే స్క్రీన్ నేమ్గా మార్చేసుకున్నాడు నాని. మరి ఇంతకు నాని అసలు పేరేంటి అనేది చాలా మందికి తెలియదు. కానీ ఇటీవల జరిగిన మజ్ను ఆడియో వేడుకలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ నాని అసలు పేరు నవీన్ అని రివీల్ చేశాడు. ..అదీ సంగతి..