సెట్ వేయలేదు.. నాని అక్కడకే వెళ్లాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఏకధాటిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది ఓటీటీలో వి సినిమాతో సందడి చేసిన నాని, కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమయ్యాడు. అయితే కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ దర్శకులు, నిర్మాతలు షూటింగ్స్ స్టార్ట్ చేయగానే తన సినిమా షూటింగ్‌కు పచ్చ జెండా ఊపేసిన నాని, ఈసారి ఏకంగా మరింత స్పీడు పెంచాడు. ఇప్పుడు టక్ జగదీష్‌ను పూర్తి చేయకుండానే శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు నాని. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కోసం నాని.. కోల్‌కతా చేరుకున్నాడు.
నానితో పాటు.. ప్రధాన తారాగణమంతా కోల్‌కతా చేరుకున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వీరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో భారీ సెట్ వేసి చిత్రీకరణనను హైదరాబాద్‌లోనే చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త చక్కబడటంతో యూనిట్ కోల్‌కతా చేరుకుంది.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట ఎస్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాహుల్ సంక్రిత్యాన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు నాని హీరోగా చేసిన టక్ జగదీష్ ఏప్రిల్ 16న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments