సామ్ , చైతు చిత్రాన్ని నిర్మించనున్న నాని నిర్మాతలు

  • IndiaGlitz, [Tuesday,February 13 2018]

ఆ జంట‌ను చూసి పుల‌కించ‌డం వెండితెర వంతైతే.. వెండితెర‌పై ఆ జంట కెమిస్ట్రీ చూసి ప‌ర‌వ‌శించ‌డం ప్రేక్ష‌కుల వంతు. ఏ మాయ చేశావే', మనం', ఆటోనగర్ సూర్య' సినిమాలతో ప్రేక్షకులకు కనువిందు చేసిన ఆ జంట.. నాగ చైతన్య, సమంత. పెళ్లి తర్వాత మొదటిసారి ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుందని సమాచారం. మొదటి సినిమా నిన్ను కోరి'తో హిట్టు కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథ నచ్చడంతో.. వీరిరువురు కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రొమాంటిక్ స్టోరీకి సంబంధించి ఇంకా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభదశలోనే ఉంది.

దీనికి తుదిమెరుగులు దిద్దిన తర్వాత.. కథ నచ్చితే సామ్, చైతు కలిసి నటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ప్రస్తుతం నాని కథానాయకుడిగా నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం' మూవీని నిర్మిస్తున్నది ఈ నిర్మాత‌లే కావ‌డం గ‌మ‌నార్హం. సామ్, చైతు చిత్రానికి సంబంధించిన‌ మరిన్ని విషయాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.