నాని ఓవర్ సీస్ హక్కులు వీరివే...
Monday, January 18, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ`. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్, థీమాటిక్ టీజర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
భలే భలే మగాడివోయ్` వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నాని హీరోగా నటిస్తున్న చిత్రమిది. యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి తెరకెక్కుతోంది. రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర నిర్మాతలు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 20న నిర్వహిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా ఫిభ్రవరి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను పిక్సల్ డ్రీమ్స్ ఎంటర్‌టైన్మెంట్ ఎల్.ఎల్.సి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఓవర్‌సీస్‌లో విడుదల చేస్తుంది. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత ఇదే డిస్ట్రిబ్యూషన్ సంస్థ నాని సినిమాను పంపిణీ చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments