జూన్ 23న వరల్డ్ వైడ్ గా నాని, దానయ్య డి.వి.వి. చిత్రం 'నిన్ను కోరి'

  • IndiaGlitz, [Friday,April 21 2017]

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'. ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రెస్‌ గురించి నిర్మాత దానయ్య డి.వి.వి. తెలియజేస్తూ - ''అమెరికాలో భారీ షెడ్యూల్‌ చేశాం. ఏప్రిల్‌ 17 నుంచి వైజాగ్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెల 29 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. జూన్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం'' అన్నారు.
నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

More News

కీర్తిసురేష్ తో సీనియర్ యాక్టర్ రొమాన్స్....

తెలుగు,తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది.

విజయ్ దేవరకొండ, పరశురాం జిఏ2 చిత్రం ప్రారంభం

వరుస సూపర్హిట్ చిత్రాల తరువాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నివాసు నిర్మాతగా జిఏ2 బ్యానర్ లో పరుశురాం దర్శకత్వంలో, `పెళ్ళిచూపులు` ఫేం విజయ్ దేవరకొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకుంది

రవితేజకు విలన్ అవుతున్న బాలీవుడ్ యాక్టర్...

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `రాజా ది గ్రేట్` సినిమాలో నటిస్తున్నాడు.

రజనీ సినిమాపై వస్తున్న రూమర్స్ ను ఖండించిన దర్శకుడు...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తదుపరి సినిమా రూపొందనుంది.

ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ '9' మోషన్ పోస్టర్ విడుదల!

గోస్ట్ హంటింగ్ కాన్సెప్ట్ తో తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రం '9'. అశ్వనీ కుమార్ దర్శకత్వంలో