వైజాగ్ లో నాని 'నిన్ను కోరి'
Monday, April 17, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి`. నేచురల్ స్టార్ నాని, నివేథా థామస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. నాని రీసెంట్ హిట్ నేను లోకల్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
యు.ఎస్ ఓవర్సీస్ హక్కులు ప్యాన్సీ రేటుకే అమ్ముడైపోయిందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ నెలాఖరున వరకు జరిగే ఈ షెడ్యూల్తో చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది.ఈ సినిమాను జూలై 11న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments