ఆ డైరెక్టర్‌తో నాని మరోసారి.. హీరోయిన్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో కొత్త చిత్రం డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఎవడేసుబ్రమణ్యం` వంటి సూపర్‌హిట్ మూవీలో నానితో నటించిన రీతూవర్మ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
నాని, శివనిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `నిన్నుకోరి` మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే హిట్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతుంది. `మజిలీ` వంటి సూపర్‌హిట్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ నెలలో సినిమా లాంఛనంగా ప్రారంభించి జనవరిలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
ప్రస్తుతం నాని తన 25వ చిత్రం `వి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆరబోతున్న సంగతి తెలసిందే. ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి కూడా నటిస్తున్నారు. నాని నెగటివ్ రోల్‌లో నటిస్తున్నాడని టాక్. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments