నాని టైటిల్ కనఫర్మ్..లుక్ అదిరింది....
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాల మీదున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మదర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్ పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో వచ్చింది. దాంతో టైటిల్ మజ్ను అనే కన్ఫర్మ అయ్యింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కుక్క బొమ్మతో నాని మాట్లాడుతున్నట్లు ఉన్న నాని టీషర్ట్ పై ఓరి నీ వేషాలు అనే రాసుంది. నాని చేతిలో బీర్ బాటిల్ లో ఈ ఫస్ట్ లుక్ చాలా బావుంది. స్టాప్ డ్రింకింగ్..స్టార్ట్ లవింగ్ అనే లైన్స్‌తో ఇదొక లవ్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments