నాని తదుపరి చిత్రానికి ముహూర్తం ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నాని ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నఈ మూవీ టైటిల్ త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత నాని ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రారంభించనున్నట్టు సమాచారం. డిసెంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని సరికొత్త తరహాలో ఈ సినిమా ఉంటుందని డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ తెలిపారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com