నాని నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఎవరంటే....

  • IndiaGlitz, [Monday,May 23 2016]

నేచురల్ స్టార్ నాని ఇప్పుడున్న లెటెస్ట్ జనరేషన్ హీరోస్ విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలను సాధిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో ఓవర్ సీస్ లో మిలియన్ డాలర్స్ హీరోగా కూడా అవతరించాడు. ఇప్పుడు జెంటిల్ మన్ అనే సినిమాతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు నానితో సినిమా చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. అయితే నాని మాత్రం చాలా సెలక్టివ్ గా ఉన్నాడు.

నాని తన మూవీని తనతో పాటు నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తాడట. ప్రస్తుతం అవసరాల శ్రీని వారాహి చలన చిత్రం బ్యానర్ పై నారారోహిత్, నాగశౌర్య కాంబినేషన్ లో జ్యో అచ్యుతానంద అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే అవసరాల శ్రీని దర్శకత్వంలో నాని సినిమా ఉంటుందట.

More News

పవన్ స్టార్ట్ చేసేస్తున్నాడు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత నెలలో సర్ధార్ గబ్బర్ సింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కలిసి ఉంటే కలదు సుఖం అని చెబుతున్న 'బ్రహ్మోత్సవం' - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

సూపర్ స్టార్ మహేష్ హీరోగా,కాజల్,సమంత,ప్రణీత హీరోయిన్స్గా పి.వి.పి.సినిమా-ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్స్ పై శ్రీకాంత్ అడ్డాల

నాని రిలీజ్ డేట్ మారింది....

నాని హీరోగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం జెంటిల్ మన్.

మహేష్ కు వర్మ సలహాలు...

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం విడుదలై అనుకున్న స్థాయిలో టాక్ తెచ్చుకోలేదు.

ఈ రికార్డ్ కూడా రజనీకే సొంతం..

రజీనీకాంత్ నటించిన చిత్రం కబాలి.జూలై 1న విడుదలవుతుంది.