Nani: 'సరిపోదా శనివారం' అంటున్న నాని..

  • IndiaGlitz, [Saturday,October 21 2023]

వరుస సినిమాలతో నేచురల్ స్టార్ నాని దూసుకుపోతున్నాడు. ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇటీవల దసరా మూవీలో ఊర మాస్ పాత్రలో నటించిన నాని.. తన 30వ చిత్రమైన హాయ్ నాన్నలో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు 31వ చిత్రానికి మరో వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. దర్శకుడు వివేక ఆత్రేయ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే అంటే సుందరానికి సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో బాక్సాపీస్ వసూళ్లలో వెనకబడినా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

నాని సరసన జంటగా ప్రియాంక అరుల్ మోహన్..

ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక నానితో కలిసి గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా ఎంపికైంది. వివేక్ ఆత్రేయ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు వెరైటీ టైటిల్‌ పెట్టారని తెలుస్తోంది. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి' అంటూ డిఫరెంట్ టైటిల్స్ పెట్టిన వివేక్.. ఇప్పుడు ఈ సినిమాకు కూడా 'సరిపోదా శనివారం' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కుతున్న 'హాయ్ నాన్న'..

ఇక ప్రస్తుతం నాని 'హాయ్ నాన్న' చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. కూతురు సెంటిమెంట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హేషమ్ అబ్బుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఫీల్ గుడ్ మూవీగా దీనిని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.

More News

Bigg Boss 7 Telugu: వెళ్లిపోతానంటూ నస.. శివాజీలో పెరిగిపోతోన్న ఫ్రస్ట్రేషన్

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులు గులాబీపురం, జిలేబీపురంగా విడిపోయి గ్రహంతరవాసులను సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Gaganyaan Mission 2023: గగన్‌యాన్ మిషన్ గ్రాండ్ సక్సెస్.. ఫలించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి..

ఇస్రో మరో అంతరిక్ష ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు చేపట్టిన గగన్‌యాన్ మిషన్ సక్సెస్ అయింది.

Election Officials:ఎన్నికల వేళ బ్యాంకు మేనజర్లకు కీలక సూచనలు చేసిన ఎలక్షన్ అధికారులు

తెలంగాణ ఎన్నికల వాతావరణం మొదలైన సంగతి తెలిసిందే. ఓ వైపు నేతల హోరాహోరి ప్రచారం.. మరోవైపు పోలీసుల తనిఖీలతో రాష్ట్రంలో

Governor:స్కిల్ కేసులో సంచలన పరిణామం.. సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై విచారణకు గవర్నర్ ఆదేశాలు

స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే ఈసారి ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించడం సంచలనంగా మారింది.

Pawan Kalyan:సీఎం పదవిపై జనసేనాని పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో