ఈసారి నాని తెలంగాణ‌పై మ‌న‌సుప‌డ్డాడు!!

  • IndiaGlitz, [Saturday,May 23 2020]

హీరో నేచుర‌ల్ స్టార్ నాని ఏంటి? తెలంగాణపై మ‌న‌సుప‌డ్డ‌మేంటి? అనే సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. వివ‌రాల్లోకెళ్తే.. నేటి త‌రం యువ క‌థానాయ‌కుల్లో వేగంగా, వైవిధ్యంగా సినిమాలు చేస్తున్న‌వారిలో నాని ముందు వ‌రుస‌లో ఉన్నాడు. ప్ర‌తి సినిమాకు ఏదో ఒక డిఫ‌రెంట్ పాత్ర‌ను చేయ‌డంతో నాని చేస్తున్న పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతున్నాయి. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో చిత్తూరు జిల్లా కుర్రాడు కృష్ణ పాత్ర‌లో నాని అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం చేస్తున్న ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలో రాజ‌మండ్రి యాస‌లో మాట్లాడే కుర్రాడి పాత్ర‌లో నాని కనిపించ‌బోతున్నారు. కాగా సుకుమార్ ద‌ర్శ‌కత్వ శాఖ‌లో ప‌నిచేసిన శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ప‌క్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరెక్క‌నుంద‌ట‌. కాబ‌ట్టి బ్యాక్‌డ్రాప్‌కు త‌గిన‌ట్లు నాని తెలంగాణ‌లో మాట్లాడ‌బోతున్నాడ‌ని స‌మాచారం. శ్యామ్ సింగ‌రాయ్ సినిమా త‌ర్వాత‌నే ఈ సినిమాలో నాని న‌టించ‌బోతున్నాడ‌ట‌. ప‌క్కా డార్క్‌మోడ్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని అంటున్నారు. ప‌డిపడి లేచె మ‌న‌సు నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ట‌.